UP – వసంత పంచమి వేళ … కుంభమేళాకు పోటెత్తిన జనం

యుపి : వసంత పంచమి వేళ సోమవారం మహాకుంభమేళాకు యాత్రికులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో అమృత్‌ స్నానాలు ఆచరించడానికి ఈరోజు 4 కోట్ల నుంచి 6 కోట్లమంది ప్రజలు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. మౌని అమావాస్య సందర్భంగా … జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు పటిష్టం చేసింది. అమృత స్నాన్‌కు ముందు జీరో-ఎర్రర్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 5వ తేదీన ప్రధాని మోడీ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేయనున్నారు.

➡️