చెన్నై: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై ముఖ్యమంతి, డిఎంకె నాయకులు ఎంకె స్టాలిన్ పరువునష్టం దావా వేశారు. తమిళనాడులో ఇటీవల భారీ మాదక ద్రవ్యాల రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అన్నాడిఎంకె, బిజెపి నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో స్టాలిన్‌కు సంబంధాలున్నాయంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ శత్రుత్వంతో, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారంటూ ఆ దావాలో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పోలీసులు, ఎన్‌సిబి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా మాదక ద్రవ్యాల నెట్వర్క్ బయటపడింది.
