తమిళ జాలర్లపై దాడులు, అరెస్ట్‌పై ప్రధానికి స్టాలిన్‌ లేఖ

Feb 11,2024 10:39 #cm stalin, #fishermen, #leater, #PM Modi
dmk ready to fight against center govt

చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పందించారు. దీనిపై ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. మత్స్యకారులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలను వేగవంతం చేయాలని కోరారు. గతేడాది శ్రీలంక అధికారులు 243 మందిని అరెస్టు చేశారని.. 37 పడవలను స్వాధీనం చేసుకున్నారని స్టాలిన్‌ గుర్తు చేశారు. ఇటీవల 12 పడవలు సహా 88 మందిని అదుపులోకి తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని తరాలుగా చేపల వేటకు ఈ జలాలను ఉపయోగిస్తున్నారు. దాడుల కారణంగా వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మత్స్యకారులు సహా అధికారులు స్వాధీనం చేసుకున్న బోట్లను విడిపించేలా శ్రీలంకతో దౌత్యపరంగా చర్చించాలి. స్వాధీనం చేసుకున్న పడవలను అక్కడి ప్రభుత్వం జాతీయం చేయడం వల్ల వాటిని వెనక్కి తెచ్చుకునేందుకు వీలు పడడం లేదు. దీంతో జాలర్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నాయి” అని స్టాలిన్‌ తన లేఖలో పేర్కొన్నారు.

➡️