కుంభమేళాలో స్టీవ్‌ జాబ్స్‌ సతీమణికి అస్వస్థత

యాపిల్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి లారీన్‌ పావెల్‌ జాబ్స్‌ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురైనట్టు జాతీయ మీడియా పేర్కొంది. భారీ జన సందోహం మధ్య నదిలో స్నానం చేయడంతో అలర్జీలు వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం లారీన్‌ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.. నిరంజని అఖారా సూచనతో పావెల్‌ ఇండియాకు వచ్చి, మహా కుంభమేళాలో పాల్గొన్న విషయం తెలిసిందే.
పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. తొలిరోజు దాదాపు 1.65 కోట్ల మంది భక్తులు నదీజలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

➡️