బిజెపి అభ్యర్థి ర్యాలీలో కార్లపై రాళ్లు

Apr 1,2024 10:23 #BJP, #cars, #Rally, #Stones

ముజఫర్‌నగర్‌ (యుపి) : బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరి, పలు కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి ఏరియాలో బిజెపి లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సంజీవ్‌ బాల్యన్‌కి మద్దతుగా ర్యాలీ జరిగింది. సభలో బాల్యన్‌ ప్రసంగిస్తుండగా, ఆ సమీపంలో పార్క్‌ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. దీనిపై నగర అదనపు ఎస్‌పి సత్యనారాయణ ప్రజాపత్‌ మాట్లాడుతూ, శనివారం రాత్రి సభలో బాల్యన్‌ మాట్లాడుతుండగా, కొందరు వాహనాలపై రాళ్లు విసిరారని, కార్ల కిటికీలు పగలగొట్టారని చెప్పారు. దాడికి పాల్పడినవారు నినాదాలు కూడా చేశారని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

➡️