ఒత్తిడి అధిగమిస్తేనే విజయం

Feb 10,2025 23:51 #Pariksha Pe Charcha, #PM Modi
  • పరీక్షా పే చర్చలో విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ : ఒత్తిడిని అధిగమించి పరీక్షలను బాగా రాయాలని, ఒత్తిడిని అధిగమిస్తేనే పరీక్షల్లో విజయం సాధించగలమని ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు సూచించారు. ఢిల్లీ సుందర్‌ నర్సరీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 35 మంది విద్యార్థులతో ఆయన సోమవారం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. సవాళ్లను ఎదుర్కోడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు. సరైన పోషకాహారం, నిద్ర కూడా చాలా ముఖ్యమని మోడీ వివరించారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని మోడీ నిర్వహించడం ఇది 8వసారి. ఇప్పటి వరకూ టౌన్‌ హాల్‌ ఫార్మాట్‌లో ఈ కార్యక్రమం నిర్వహించిన మోడీ ఈసారి ఢిల్లీలోని సుందర్‌ నర్సరీలో నిర్వహిం చారు. ఒత్తిడికి గురికాకుండా చదువుపై దృష్టి పెట్టాలని, పరీక్షలే అన్నీ అనే ఆలోచనతో జీవిం చకూడదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇతరులతో పోల్చకూడదని, పిల్లలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

➡️