భవనం ఖాళీ చేసేందుకు ఆప్‌కు గడువు పొడిగించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ :    స్థానిక రౌస్‌ అవెన్యూలోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు ఆప్‌ పార్టీకి ఇచ్చిన గడువును ఆగస్ట్‌ 10 వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం గతంలో ఈ ప్రాంతాన్ని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు గుర్తించామని జస్టిస్‌ విక్రన్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది. ఆప్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ సహా ఇతర న్యాయవాదుల సమర్పణలను పరిగణనలోకి తీసుకుని గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆగస్టు 10వ తేదీలోపు రౌస్‌ అవెన్యూలోని 206లో ఉన్న భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని ఆప్‌ను ఆదేశించింది.

➡️