Supreme Court : కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 27న విచారణ

న్యూఢిల్లీ :    ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బిఆర్‌ఎస్‌ నేత కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఆగస్ట్‌ 27 ( మంగళవారం ) విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్‌ బి.ఆర్‌.గవై, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది.

రెండు కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ జులై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ఆగస్ట్‌ 12న సిబిఐ, ఇడి ప్రతిస్పందనలను కోరింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె ఒకరని పేర్కొంటూ రెండు కేసుల్లోనూ బెయిల్‌ పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

➡️