స్వాతి మాలివాల్‌ దాడి కేసు- హైకోర్టుకు బిభవ్‌కుమార్‌

May 29,2024 23:45 #Bibhav Kumar, #Delhi, #high court

న్యూఢిల్లీ : ఆప్‌ ఎంపి స్వాతిమాలివాల్‌పై దాడి కేసులో నిందితుడు బిభవ్‌కుమార్‌ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. స్వాలిమాలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్వి బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్‌కుమార్‌ ఈ నెల18న పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. బిభవ్‌ ఈ దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.
కాగా, బిభవ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను దిగువ కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో వాదనలు విన్న మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గౌరవ్‌ గోయల్‌.. బిభవ్‌కుమార్‌కు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన తాజాగా తన అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు.

➡️