చెన్నై : చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులపై శిక్షలను మరింత కఠినతరం చేసేలా తమిళనాడు ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం అసెంబ్లీలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ నేరాలను కూడా ఇందులో చేర్చింది.
భారతీయ న్యాయ సంహిత 2023 కింద మహిళలు, పిల్లలపై వేధింపులకు శిక్షలను పెంచాలని, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత,2023 ప్రకారం.. బెయిల్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను మరింత కఠినతరం చేసేలా సవరించాలని ప్రభుత్వం పేర్కొంది. నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ఇటువంటి నేరాలను, చర్యలను కచ్చితంగా అడ్డుకోవచ్చని బిల్లు తెలిపింది.
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలతో మహిళలపై వేధింపులను ఎదుర్కోవడానికి తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం, 1998ని సవరించాలని పేర్కొంది.