ఉగ్రవాదానికి మన ప్రపంచంలో చోటు లేదు

  • నెతన్యాహుకు వత్తాసు పలికిన మోడీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మన ప్రపంచంలో చోటు లేదని ప్రధాని నరేంద్ర మోడీ సహచర ఇజ్రాయిలీ నేత నెతన్యాహుతో అన్నారు. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారి తీయకుండా నివారించడం, బందీలందరూ సురక్షితంగా విడుదలయ్యేలా చూడడం కీలకమని అన్నారు. ఉగ్రవాదులన్న ముద్ర వేసి హిజ్బుల్లా నాయకత్వాన్ని, అలాగే అనేక మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న యుద్ధోన్మాది నెతన్యాహు చర్యను మోడీ ఖండించడానికి బదులు దానిని బలపరిచేలా మాట్లాడడం పలు విమర్శలకు దారి తీసింది. పశ్చిమాసియాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మన ప్రపంచంలో ఉగ్రవాదానికి తావు లేదని తెలియజేస్తున్నాయని మోడీ తన మిత్రుడికి ఎక్స్‌ ద్వారా సందేశమిచ్చారు.
ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతను పునరుద్ధరించేందుకు జరుగుతున్న యత్నాలకు భారత్‌ మద్దతు ఇస్తుందన్నారు. గత వారం రోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ పెద్దయెత్తున బాంబుల వర్షం కురింపించడం గురించి కానీ, హిజ్బులా  చీఫ్‌ నస్రల్లాతో సహ అగ్ర నేతలను వరుసగా హత్య గావించిన నెతన్యాహు చర్యను కానీ మోడీ మాట మాత్రంగా కూడా అందులో ప్రస్తావించలేదు.

➡️