ముంబయి : ఇటీవల రతన్‌టాటా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు సందేశాలు పంపారు. ఈ వారం ప్రారంభంలో (అక్టోబర్ 7)న వచ్చిన ఆ వార్తలపై రతన్‌టాటా స్వయంగా స్పందించారు. నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
”వయస్సు సంబంధిత అనారోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఉత్సాహంగా ఉన్నాను” అని పోస్ట్ చేశారు. ”తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దు” అని ప్రజలను, మీడియాను అభ్యర్థించారు. అదే ఆయన చివరి పోస్ట్.