అది జాతీయ కాషాయ విధానం!

Mar 13,2025 07:22 #Stalin
  • ఎన్‌ఇపిపై స్టాలిన్‌ విమర్శ

చెన్నై : జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి), హిందీ భాషను అభివృద్ధిపరచడానికి ఉద్దేశించిన జాతీయ కాషాయ విధానమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం విమర్శించారు. ప్రతిపాదిత పునర్విభజన ప్రక్రియతో ఉత్తరాది రాష్ట్రాల్లో విజయం సాధించడం ద్వారా అధికారంలో కొనసాగడానికి బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, తమ ప్రభావం, ప్రాబల్యం వున్న రాష్ట్రాల్లో ఎంపిల సంఖ్యను పెంచుకోవడానికి, తద్వారా తమ పార్టీని అభివృద్ధిపరుచుకోవడానికి బిజెపి చూస్తోందని అన్నారు. డిఎంకె దాన్ని నిరోధిస్తుందని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానం వల్ల తమిళనాడు విద్యా రంగంలో పురోగతి అంతా పూర్తిగా నాశనమవుతుందని స్టాలిన్‌ పేర్కొన్నారు. కేంద్రం విధానాలను, వైఖరిని ఖండిస్తూ ఏర్పాటు చేసిన పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయమైన రిజర్వేషన్లను ఎన్‌ఇపి అంగీకరించదన్నారు. వృత్తి విద్య పేరుతో కుల ప్రాతిపదిక విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

➡️