బెంగాల్‌ గవర్నర్‌ పర్యటన మోడల్‌ కోడ్‌ని ఉల్లంఘించడమే : ఇసి

న్యూఢిల్లీ :   కూచ్‌బెహార్‌ పర్యటనపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్‌బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో ఏప్రిల్‌ 18, 19 తేదీలలో పర్యటించాలని గవర్నర్‌ నిర్నయించారు. అయితే ఏప్రిల్‌ 19న మొదటి దశ పోలింగ్‌ జరగనున్నందున నేటి సాయంత్రం నుండి సైలెన్స్‌ అవర్‌ ప్రారంభమవుతుందని ఇసి పేర్కొంది.  దీంతో ఈ సమయంలో గవర్నర్‌ పర్యటన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి)ని ఉల్లంఘించినట్లేనని హెచ్చరించింది. సైలెన్స్‌ అవర్‌ ప్రారంభమైన తరుణంలో సంబంధిత నియోజకవర్గంలోని ఓటర్లు కాని విఐపిలు, రాజకీయ నేతలు ఆ ప్రాంతాన్ని వీడాల్సి వుందని ఇసి ప్రామాణికంగా ఆదేశించింది. ఇది నియోజకవర్గంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి అత్యసరమని ఇసి పేర్కొంది. విఐపిలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే వారికి రక్షణ కల్పించాల్సిన అదనపు బాధ్యత భద్రతా దళాలపై పడుతుందని హెచ్చరించింది.

➡️