ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.180 లక్షల కోట్లకు పెరగనుంది. శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అప్పుల వివరాలను పేర్కొన్నారు. 2025-26 ఏడాదికి గాను రూ.180,78,254.08 కోట్లకు రుణాలు పెరగనున్నట్లు తెలిపారు. అందులో దేశీయ రుణాలు రూ.174,14,333.42 కోట్లకు, విదేశీ అప్పులు రూ.6,63,920.67 కోట్లకు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది 2024-2025 బడ్జెట్‌లో రూ.165,50,553.49 కోట్లను అప్పుగా చూపించింది. అందులో దేశీయ అప్పు రూ.159,32,257.73 కోట్లు కాగా, విదేశీ అప్పు రూ.6,18,295.76 కోట్లు అని పేర్కొంది. అంటే ఏడాదిలో రూ.15,27,700.59 కోట్లు అప్పు పెరిగింది.
