పాలక్కాడ్: కేరళలోని పట్టాంబిలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీ కూలిపోయింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. గాయపడిన వారిని పట్టాంబిలోని ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్చారు.
