ఎంపీ సెల్వరాసు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు

May 14,2024 12:18 #MP Selvaras, #passed away

చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నాగపట్నం పార్లమెంటు సభ్యుడు ఎం. సెల్వరాసు (67) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సెల్వరాసు మృతి పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సంతాప సందేశం విడుదల చేశారు. సెల్వరాసు మృతి పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. సెల్వరాసు తిరువారూర్‌ జిల్లా నీడమంగళం ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో చిన్న వయసులోనే విద్యార్థి మండలి, యువజన మండలి వంటి సంస్థల్లో చురుకుగా పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాగపట్నం జిల్లా కార్యదర్శితో సహా పలు పదవులకు ఎన్నికై అంకితభావంతో పని చేశారు. నాగపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలుపొంది ఆ నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పొందారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని కె. బాలకృష్ణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

➡️