J-K Assembly polls – 9 గంటలకు 11 శాతం పోలింగ్

జమ్ము కాశ్మీర్‌ : జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల మూడవ, చివరి దశ పోలింగ్‌ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు 11. 60 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉధంపూర్‌ నియోజకవర్గంలో  14.23 శాతం, సాంబా 13.31 శాతం, బండిపోరా 11.64 శాతం, బారాముల్లా 8.89 శాతం, జమ్ము 11.46 శాతం,  కథువా 13.09 శాతం, కుప్వారా 11.27 శాతం పోలింగ్ నమోదైందని ఇసి తెలిపింది.

ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉధంపూర్‌, సాంబా, కథువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాలకు చెందిన 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్‌ స్టేషన్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

తుదివిడత పోలింగ్‌లో మొత్తం 415 మంది అభ్యర్థులు …
జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ తుదివిడత పోలింగ్‌లో మొత్తం 415 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దశ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్‌, ముజఫర్‌ బేగ్‌ పోటీలో ఉన్నారు. పశ్చిమ పాకిస్తాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజానికి చెందినవారు, గూరా కమ్యూనిటీవారు. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

తగిన భద్రతా ఏర్పాట్లు చేశాం : జమ్ము రీజియన్‌ అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ) ఆనంద్‌ జైన్‌
శాంతియుతంగా ఓటింగ్‌ కొనసాగేందుకు పోలింగ్‌ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ము రీజియన్‌ అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ) ఆనంద్‌ జైన్‌ తెలిపారు. జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 61.38 శాతం పోలింగ్‌ నమోదుకాగా, సెప్టెంబర్‌ 26 న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. నేడు జరగనున్న తుదివిడత ఎన్నికల్లో 18 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల 1.94 లక్షల మంది యువకులు, 35,860 మంది వికలాంగ ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన 32,953 మంది వఅద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

➡️