వారణాసిలో అట్టహాసంగా మోడీ నామినేషన్‌

May 14,2024 22:12 #nomination, #PM Modi, #Varanasi
  • హాజరైన చంద్రబాబు

వారణాసి : వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడవసారి బరిలోకి దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు నామినేషన్‌పత్రాలను దాఖలు చేశారు. బిజెపి కార్యర్తలు, మద్దతుదారులతో ఊరేగింపుగా వెళ్లి వారణాసిలో ఆయన నామినేషన్‌ వేశారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు గుర్తుగా పండిట్‌ గణేవ్వర్‌ శాస్త్రిని తన నలుగురి ప్రతిపాదకులలో ఒకరిగా పక్కన కూర్చోబెట్టుకున్నారు. మిగతా ముగ్గుర ప్రతిపాదకుల్లో ఆరెస్సెస్‌ కార్యర్త బైద్యనాథ్‌ పటేల్‌, ఒబిసి సభ్యుడు లాల్‌చంద్‌ కుష్వాహా, దళిత సభ్యుడు సంజరు సోంకర్‌ ఉన్నారు. నామినేషన్‌ వేసేందుకు ఆయన వెంట జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయానికి వెళ్లిన వారిలో ఎన్డీయేలో భాగస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ వారణాసి నుండి పోటీ చేసి గెలుపొందారు నామినేషన్‌ పత్రాలు సమర్పించడానికి ముందు భారత రాజ్యాంగం పట్ల నాకు విశ్వాసం, విధేయత ఉంటుందని ప్రమాణం చేస్తూ ఒక పత్రాన్ని ఎన్నికల రిజిస్ట్రార్‌కు ఆయన అందజేశారు. జూన్‌1న చివరి విడతలో ఎన్నికలు జరిగే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వారణాసి ఒకటి. మొదటి రెండు దశల్లో ఓట్లు తక్కువగా పోలవడంతో ఓటమి భయం పట్టుకున్న ప్రధాని మోడీ దేశంలో ఇస్లామిక్‌ ఫోబియోను రెచ్చగొట్టే యత్నం చేశారు. ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తూ ముస్లింలను చొరబాటుదారులుగాను, ఎక్కువ మంది పిల్లలను కనేవారిగాను నిందిస్తూ ఎన్నికల ప్రసంగాలు చేశారు.

➡️