సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం

గ్యాంగ్‌టక్‌: సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) ఘన విజయం సాధించింది. ఇటిప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎస్‌కేఎం 29 స్థానాల్లో గెలిచింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్‌ ఫిగర్‌ 17 స్థానాలు.
విపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీకి కేవలం ఒకే స్థానంలో గెలిచి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండు పార్టీలు మొత్తం 32 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక బీజేపీ అక్కడ 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ ఖాతా తెరవలేదు.

➡️