న్యూఢిల్లీ: రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉంది. మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు, నియోజకవర్గాల పునర్విభజన, హిందీ భాష విధించడం, అమెరికన్ ఉత్పత్తుల దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం వంటి అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదేసే అవకాశం ఉంది. మరోవైపు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం కోసం హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలుస్తోంది. మణిపూర్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరిలో మొదటి బడ్జెట్ సమావేశం ముగిసిన సంగతి విదితమే.
