న్యూఢిల్లీ : ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ను తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
