ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్‌ రద్దు చేయాలి

Apr 11,2025 22:18 #SFI, #Students Protest

– ఎస్‌ఎఫ్‌ఐ నిరాహార దీక్ష
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీలోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్‌ రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యాన నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించారు. విద్యార్థులు నాడియా, అనన్‌, హర్ష్‌ల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు శరణ్య, ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్‌ కార్యదర్శి షెఫాలి డిమాండ్‌ చేశారు. వారికి ఎస్‌ఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. వారి ముగ్గురి సస్పెన్షన్‌ రద్దు చేసేవరకూ మంచినీళ్లు కూడా తాగకుండా నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇది దళిత, ముస్లిం విద్యార్థులపై తీసుకున్న చర్య అని విమర్శించారు. సస్పెండ్‌ అయిన విద్యార్థులు ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయం విచారణను రెండుసార్లు ఆలస్యం చేసి, ముగ్గురు విద్యార్థుల విద్యా భవిష్యత్తును పణంగా పెట్టిందని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు విమర్శించారు.

➡️