సమైక్యత, సామరస్య పరిరక్షణకే ఓటు : ఏచూరి

  • ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న కరత్‌ దంపతులు

న్యూఢిల్లీ: సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం ఢిలీల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లి ఓటు వేశారు.
అనంతరం ఏచూరి మాట్లాడుతూ, దేశం కోసం,రాజ్యాంగ పరిరక్షణ కోసం, భారత దేశ ఐక్యత, సామరస్యాన్ని కాపాడడం కోసం ఓటు వేశాను అని చెప్పారు. సీతారాం ఏచూరితోబాటు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ బూత్‌లో ఓటింగ్‌ మెషిన్‌ మొరాయించడంతో కొద్ది సేపు పోలింగ్‌కు కొద్ది సేపు అంతరాయమేర్పడింది. ఉదయం 9.15 గంటలకే ఓటింగ్‌ మెషిన్‌ బ్యాటరీ డౌన్‌ అవడం వల్ల 30 నిమిషాలసేపు పనిచేయలేదు. దీనిపై బృందా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరిగింది.

➡️