ఉచితాలకు డబ్బులుంటాయి.. న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్ల కోసం ఉండవా..?

Jan 8,2025 07:21 #Delhi, #Supreme Court

ఢిల్లీ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య
న్యూఢిల్లీ : ”న్యాయమూర్తులకు జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వాలు ఆర్థిక పరిమితుల గురించి మాట్లాడతాయి” అని న్యాయమూర్తుల జీతాల కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. ఉచితాల పంపిణీ చేయడానికి ప్రభుత్వాల వద్ద డబ్బు ఉందని, కానీ న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి కాదని పేర్కొంది. ‘కొందరు రూ. 2100, మరికొందరు రూ. 2500 ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు’ అని ఢిల్లీ ఎన్నికల్లో చేస్తున్న ప్రకటనలను కూడా ఎస్సీ బెంచ్‌ ప్రస్తావించింది.
న్యాయమూర్తుల జీతం, పదవీ విరమణ ప్రయోజనాలపై అఖిల భారత న్యాయమూర్తుల సంఘం 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. న్యాయమూర్తులకు సకాలంలో వేతనాలు అందడం లేదని, పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు పొందే ప్రయోజనాలను కూడా అందకుండా చేస్తున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ బీఆర్‌ గవారు, జస్టిస్‌ ఏజీ మసీV్‌ా విచారించారు.

న్యాయమూర్తుల జీతాల గురించి మాట్లాడితే ఆర్థిక సంక్షోభం ప్రస్తావన..
న్యాయమూర్తులకు జీతాలు చెల్లించే విషయంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతుందని, అయితే ఎన్నికలు వచ్చినప్పుడు లాడ్లీ బెహనా , ఇతర పథకాలను అమలు చేస్తామని ఎస్సీ బెంచ్‌ పేర్కొంది. ఢిల్లీలో చూస్తే ఇక్కడ కూడా పార్టీలు అధికారంలోకి వస్తే రూ.2100, రూ.2500 ఇస్తామని చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది.

➡️