‘తత్కాల్‌’ టైమింగ్స్‌లో మార్పులేదు

Apr 11,2025 23:02 #Indian Railways

న్యూఢిల్లీ : రైలు టికెట్ల తత్కాల్‌ బుకింగ్‌ వేళలు మారనున్నట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటివి నమ్మొద్దంటూ పిఐబి ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ”ఏప్రిల్‌ 15 నుంచి తత్కాల్‌ బుకింగ్‌ సమయాలు మారుతాయని సోషల్‌ మీడియాలో ఒక ఫొటో సర్క్యులేట్‌ అవుతోంది. అది పూర్తిగా అవాస్తవం. ఏసీ, నాన్‌ ఏసీ తరగతులకు తత్కాల్‌ లేదా ప్రీమియం తత్కాల్‌ బుకింగ్‌లో ప్రస్తుతం ఉన్న సమయాల్లో ఎలాంటి మార్పునూ ప్రతిపాదించలేదు. ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్‌ సమయాలూ మారవు” అని పేర్కొంది.

➡️