సొరంగం కూలిన శబ్దానికి నా చెవులు మొద్దుబారిపోయాయి : అఖిలేష్‌ సింగ్‌

Nov 29,2023 16:18 #Uttarkashi tunnel

 

డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కార్మికుల్లో ఒకరైన అఖిలేష్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ముందే సొరంగం కూలిపోయింది. పెద్దశబ్దం రావడంతో.. నా చెవులు మొద్దుబారిపోయాయి. కొద్దిసేపటి వరకు నాకు ఏమీ వినపడలేదు. దాదాపు 18 గంటలపాటు మాకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. మా శిక్షణ ప్రకారం మేము చిక్కుకున్న వెంటనే నీటి పైపును తెరవాలి. ఆవిధంగానే నీటి పైపును తెరిచాము. పైపు నుంచి నీరు పడడం ప్రారంభించినప్పుడు బయట ఉన్న వ్యక్తులు మేము ఎక్కడున్నామో గుర్తించి, మాకు ఆక్సిజన్‌ పంపారు. ఆ తర్వాత స్టీల్‌ పైపు ద్వారా ఆహారాన్ని పంపారు. ఇంకా 25 రోజులకు సరిపాడా ఆహారం సొరంగంలో ఉంది.’ అని అన్నారు.

➡️