మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ బతికే ఉంటా

  • బహిరంగసభలో అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గే

శ్రీనగర్‌ : కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ అలసిపోనని, బతికే ఉంటానని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమ్ముకాశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అదుపుతప్పి పడిపోబోయిన ఆయనను అక్కడున్న నేతలు పట్టుకుని, మంచినీళ్లు తాగించారు. ఆ తరువాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకొస్తాం. అందుకోసం పోరాడుతూనే ఉంటాం. ఎనిమిది పదుల వయసులో ఉన్న నేను అప్పుడే చనిపోను. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ అలసిపోను. అప్పటివరకూ బతికే ఉంటా’ అని అన్నారు.

➡️