ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా గుర్తుతెలియని ఓ వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు సందేశం వచ్చింది. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే.. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఇటీవల ఓ ఆగంతకుడి నుంచి సందేశం వచ్చిన విషయం తెలిసిందే. ‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్‌ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోరు గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ (ఇటీవల హత్యకు గురైన) కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అగంతకులు పంపిన సందేశంలో బెదిరించారు. అనంతరం అతడు మరో సందేశం పంపించాడు. ‘నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి” అని పేర్కొన్నాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పలు బందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఝార్ఖండ్ పోలీసుల సాయంతో జంషెడ్‌పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.