రాజీవ్‌ హత్య కేసులోని ముగ్గురు దోషులు విడుదల

తిరుచ్చి : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషులైన ముగ్గురు శ్రీలంక జాతీయులు మురుగన్‌, రాబర్ట్‌ పయాస్‌, జయకుమార్‌లు మంగళవారం రాత్రి విడుదలయ్యారు. జైలు నుండి ముందుగానే విడుదలైన వీరిని తర్వాత తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో నిర్బంధంలో వుంచారు. వారిని తిరిగి శ్రీలంకకు పంపించేందుకు కేంద్ర హెం శాఖ నుండి తుది అనుమతి లభించిన తర్వాత ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్న రెవిన్యూ విభాగం వారిని విడుదల చేసింది. భారీ భద్రత మధ్య పోలీసు వాహనంలో వారిని చెన్నై తీసుకెళ్ళారు. అక్కడ నుండి వారి శ్రీలంక వెళ్ళారు. వీరికి కావాల్సిన ప్రయాణ పత్రాలను శ్రీలంక అధికారులు సమకూర్చారు.

➡️