రైసీ చేరుకున్న ఎన్‌ఐఎ బృందం

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని రైసీ జిల్లాలో బస్సుపై ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఎన్‌ఐఎ బృందం సోమవారం చేరుకుంది. స్థానిక పోలీసుల సమన్వయంతో విచారణ ప్రారంభించింది. మరోవైపు భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాత్రాలోని మాతో వైష్ణోదేవి ఆలయం నుంచి శివఖోరి మందిరానికి వెళుతున్న బస్సుపై ఆదివారం రైసీ జిల్లాలో ఉగ్రవాదులు దాడి జరపడంతో బస్సు లోయలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బస్సులో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీకి చెందిన యాత్రీకులు ఉన్నారు. ఈ దాడిలో రాజస్థాన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడితో సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది తుపాకీ కాల్పుల్లో గాయపడ్డారు.

➡️