- ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత
సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో బిజాపూర్ సరిహద్దు వద్ద భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగు తున్నట్టు సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు.
కాగా, మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు , డ్రైవర్ చనిపోయారు. కాల్పులు, మందుపాతర ఘటనలతో దండకారుణ్యంలో అడవి బిడ్డల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.