Gujarat : రాజ్‌కోట్‌లోని అట్లాంటిస్‌ భవనంలో అగ్నిప్రమాదం : ముగ్గురు మృతి

Mar 14,2025 15:58 #Fire broke out, #Gujarat

రాజ్‌కోట్‌ : గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని అట్లాంటిస్‌ బహుళ అంతస్తుల భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ బిజె చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘భవనంలో చెలరేగిన మంటల వల్ల ముగ్గురు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాము. ఆ ఫ్లాట్‌లో నివశిస్తున్న వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాము. భవనంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారంగా మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనాకొచ్చాము. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు’ అని ఆయన అన్నారు.

➡️