జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ భగం చేసింది. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.జమ్మూకశ్మీర్‌లో గత కొద్దివారాలుగా పలు చొరబాటు యత్నాలు, టెర్రరిస్టు దాడులు చోటుచేసుకున్నాయి. అమర్‌నాథ్ వార్షిక యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు జమ్మూకశ్మీర్ బేస్ క్యాంపునకు వస్తుండటంతో ఉగ్రవాదులు తెగబడుతున్నారు.
