ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేడు అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టనుంది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చింది. కేంద్ర సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తుందని ఆ పార్టీ పేర్కొంది.
