చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా నేడు మైలాడుతురై, కారైకల్, పెరంబలూరు, అరియలూరు జిల్లాల్లో జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రక టించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం ఉదయం 5.30 గంటల వరకు పుదుచ్చేరిలో 12 సెం.మీ, కొల్లిడంలో 11 సెం.మీ, మైలాడుతురై జిల్లాలోని మానల్మేడులో 10సెం.మీ, గుమ్మినపూండిలో 7 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.