రన్‌ వే పై ట్రాక్టర్‌ మొరాయింపు – 40 నిముషాలు గాల్లోనే ఇండిగో విమానం చక్కర్లు

పాట్నా : పాట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం లాంగ్‌ కావల్సిన ఇండిగో విమానం గాల్లోనే 40 నిముషాలు చక్కర్లు కొట్టింది. రన్‌ వే పై గడ్డిని కోసే ట్రాక్టర్‌ అకస్మాత్తుగా బురదలో కూరుకుపోయి కదలకుండా మొరాయించింది. అదే సమయంలో కోల్‌కతా నుండి పాట్నాకు వస్తున్న ఇండిగో విమానం అప్రమత్తమై ఆ ట్రాక్టర్‌ను అక్కడి నుండి తీసేంతవరకు గాల్లోనే 40 నిముషాలు చక్కర్లు కొట్టింది. ఎయిర్‌పోర్టు సిబ్బంది 20 నిముషాలు కష్టపడి ఆ ట్రాక్టరును రన్‌ వే పైనుండి తొలగించగా, ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌ ఆలస్యం కావడంతో … విమానాశ్రయం అధికారులు స్పందిస్తూ … ప్రయాణికులకు కలిగిన ఆలస్యానికి, అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఉదయం పొగమంచు కారణంగా లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్‌ కాలేదు. హైదరాబాద్‌, జైపూర్‌, బెంగళూరు, ఇండోర్‌ నుంచి వచ్చే విమానాలు దారి కనిపించక గాలిలో చక్కర్లు కొట్టడంతో అధికారులు వాటిని దారి మళ్లించారు.

➡️