Tragedy హోళీ వేడుకల్లో విషాదం

  •  కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌ : హోలీ పండుగ వేడుకల వేళ … హిమాచల్‌ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉనా జిల్లా అంబ్‌ సబ్‌ డివిజన్‌లోని మేడిలో హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పండుగ వేడుకల్లో భాగంగా … గంగా నదిలో స్నానాలు చేస్తుండగా, అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటంతో భయాందోళనకు గురై పలువురు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, తొమ్మిదిమంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరినీ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

➡️