నడిరోడ్డుపై విషాదం

Jul 24,2024 07:06 #Current shock, #Delhi

 కరెంట్‌ షాక్‌తో యువకుడి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలె విషాదం చోటుచేసుకుంది. యుపిఎస్‌సి పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్‌ రాజ్‌గా గుర్తించారు. పటేల్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం నీలేష్‌ రాజ్‌ అనే యువకుడు పటేల్‌ నగర్‌ హాస్టల్‌లో ఉంటూ సివిల్స్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. అయితే వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలవడంతో అటువైపు వెళ్తున్న నీలేష్‌ విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రోడ్డు పక్కనున్న ఇనుప గేటు గుండా కరెంట్‌ పాస్‌ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు తెలిపారు. నీలేష్‌ను వెంటనే ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేట్‌కు కరెంట్‌ ఎలా పాస్‌ అయ్యిందో తెలుసుకునేందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు మండిపడుతున్నారు.

➡️