హైవేపై విషాదం.. కారు ఢీకొని పెద్ద పులి మృతి.. వీడియో వైరల్‌

May 22,2024 11:17 #death, #Maharashtra, #Tiger
  •  ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి

భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి తీవ్రంగా గాయపడింది. దాని ముందు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో అది బాధతో విలవిల్లాడుతూ.. వెనక కాళ్లతోనే డేకుతూ రోడ్డుపక్కనున్న పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను మరో కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీసి తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశాడు. గాయపడ్డ పులిని కాపాడేందుకు నాగ్‌ పూర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూసిందని పేర్కొన్నాడు.

➡️