చెన్నై : వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ తమిళగ వెట్రి కజగన్ (టివికె) అధ్యక్షుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పార్టీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చట్టం ముస్లిం కమ్యూనిటీ పట్ల వివక్ష చూపుతోందని, వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ సహా పలువురు దాఖలు చేసిన 12కి పైగా పిటిషన్లను ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెబ్‌సైట్ పేర్కొంది.
