కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా హింసాత్మకంగా ఘటనలకు సంబంధించి మరో 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్ట్ చేశామని ఆదివారం సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నేడు రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, భద్రతాదళాలను మోహరించామని అన్నారు. ముర్షిదాబాద్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఈ హింసాకాండంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
జిల్లాలోని సుతి, ధులియన్, సంమ్సేర్‌గంజ్ మరియు జంగీపూర్ ప్రాంతాలలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ప్రధాన రహదారులపై భద్రతాదళాలు వాహనాలను తనిఖీ చేస్తున్నాయని, సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నాయని అన్నారు. మరో 12మందిని అదుపులోకి తీసుకున్నాం అని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధ ఉత్తర్వులు విధించామని, ఇంటర్నెట్‌ను నిలిపివేశామని అన్నారు.