Nashik : ఫైరింగ్‌ సాధనలో ఇద్దరు అగ్నివీరుల మృతి

ముంబయి :  ఫైరింగ్‌ సాధనలో  షెల్  పేలడంతో ఇద్దరు అగ్నివీరులు మరణించారు. గురువారం మధ్యాహ్నం నాసిక్‌ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కొంతమంది   అగ్నివీర్‌ బృందం  ఫైరింగ్‌  సాధన చేస్తుండగా షెల్ పేలడంతో  గోహిల్‌ విశ్వరాజ్‌ సింగ్‌ (20), సైఫత్‌ సిట్‌(21)లు ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే డియోలాలిలోని ఎంహెచ్‌ ఆస్పత్రిలో చేర్చామని, చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. హవల్దార్‌ అజిత్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టినట్లు తెలిపారు.

➡️