తిరువనంతపురం : కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కొజికోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
కొజికోడ్ జిల్లా అథోలి సమీపంలోని కొలియోట్టుతాజామ్‌లో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢ కొన్నాయి. అతి వేగం కారణంగా ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. బస్సులు ఢకొీన్న వేగానికి డ్రైవర్ల క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయని అన్నారు.