మావోయిస్టులపై నిఘాకు యూఏవీ

Jul 11,2024 08:20 #Maoists, #spy, #UAV

ఛత్తీస్‌గడ: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులపై నిఘా వేసేందుకు మానవరహిత గగనతల వాహనాలను (యూఏవీ) వినియోగించాలని భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయగలవని అంచనా. వీటితో మావోయిస్టుల కదలికలపై పూర్తి అంచనా వస్తుందని చెబుతున్నారు. యూఏవీ సమాచారం సరాసరి సెంట్రల్‌ మానిటర్‌ రూమ్స్కు చేరుకుంటుందని, వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు వివరిస్తున్నారు.

➡️