UCC : ఈ నెల నుంచే యుసిసి చట్టాన్ని అమలు చేస్తాం : ఉత్త‌రాఖండ్ సీఎం

Jan 9,2025 16:41 #UCC, #Uttarakhand CM

బ‌రేలీ: ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఏకరూప పౌర స్మృతి  (యుసిసి) అమ‌లు కానున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సిఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. గురువారం బరేలీలో 29వ ఉత్తరాయణి మేళాని పుష్క‌ర్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో  యుసిసిని ఈ నెల నుంచే అమలు చేస్తాం’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యుసిసి ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పారు. బాబా సాహబ్ భీమ్ రావ్ అంబేద్కర్ ఆర్టికల్ 44 ను ప్రవేశపెట్టినప్పుడు, అతను రెండు రాష్ట్రాలు, దేశాలలో ఏకరీతి సివిల్ కోడ్ అమలులో ఉండేలా నిబంధన పెట్టారు” అని ధామి చెప్పారు.

కాగా, 2024  ఫిబ్ర‌వ‌రి ఏడ‌వ తేదీన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం కూడా  వెంట‌నే ద‌క్కింది. ఆ త‌ర్వాత మార్చి 12, 2024లో నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉమ్మ‌డి పౌర స్మృతి 2024 చ‌ట్టాన్ని రూపొందించారు. జ‌న‌వ‌రి 2025 నుంచి ఆ చ‌ట్టాన్ని పూర్తిగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. యూసీసీ అమ‌లు కోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌, మొబైల్ యాప్ డెవ‌ల‌ప్ చేశారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల సాధికార‌తే ల‌క్ష్యంగా యూసీసీ అమ‌లు ఉంటుంద‌ని సీఎం ధామి గ‌తంలో తెలిపారు.

➡️