ముంబయి : మహారాష్ట్రలో రాజ్‌కోట్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలింది. ఈ ఘటనపై శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఘటనపై ఉద్ధవ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. అవినీతి వ్యవహారాలు అదుపు తప్పాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎలా కుప్పకూలిందో ప్రజలు చూశారు. బలమైన గాలుల కారణంగానే విగ్రహం కూలిందని పాలకులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యం? ఈ ఘటనపై వారెలాంటి ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు’ అని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.
నేల కూలిన శివాజీ విగ్రహం : ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ఉద్ధవ్‌ఠాక్రే మండిపాటు
