Udhayanidhi Stalin : కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు పేరు కూడా లేదు

చెన్నై : బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని డిఎంకె నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మాకు నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో తమిళనాడు పేరు కూడా లేదు. తుఫాను విపత్తు సంభవించిన తర్వాత తమిళనాడుకి సహాయ నిధిని విడుదల చేయమని కేంద్రాన్ని అడిగాము. ఇప్పటివరకు కేంద్రం ఆ నిధుల్ని విడుదల చేయలేదు. కేవలం ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులను మాత్రమే విడుదల చేశారు. కేంద్రం చూపుతున్న ఇలాంటి పక్షపాత వైఖరిని తమిళనాడు ప్రజలు గమనిస్తున్నారు. కచ్చితంగా సమయం వచ్చినప్పుడు వారు సమాధానం చెబుతారు.’ అని ఆయన అన్నారు. అంతకుముందు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. ఇప్పుడు ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ అంగీకరించడం లేదు. దయచేసి హిందీని బలవంతంగా తమపై రుద్దకండి అని ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు.

కాగా, తమిళనాడు ప్రభుత్వం హిందీ భాషను విమర్శిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి)ని అమలు చేసి తీరుతామని కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రసాద్ అన్నారు.

 

➡️