21, 27 తేదీల్లో యూజీసీ నెట్‌ -2025

Jan 14,2025 21:27 #Exams, #UGC NET

ఢిల్లీ : యూజీసీ పరీక్షల టైంను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రీషెడ్యూల్‌ చేసింది. జనవరి 15న జరగాల్సిన యూజీసీ నెట్‌-2025 పరీక్షను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షలను ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్స్‌లో నిర్వహించనున్నట్టు తాజాగా ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డ్స్‌ను వెబ్సైట్‌ నుంచి మళ్ళీ డౌన్లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

➡️