యుజిసి ముసాయిదాను ఉపసంహరించుకోవాలి

  • తమిళనాడు శాసనసభ తీర్మానం

చెన్నయ్ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ముసాయిదా నిబంధనలపై తమిళనాడు శాసనసభ మండిపడింది. దానిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ యుజిసి ముసాయిదా నిబంధనలు సమాఖ్యకు వ్యతిరేకమని, రాష్ట్ర ఉన్నత విద్యా ప్రయోజనాలకు భంగకరమని విమర్శించారు. ఇప్పటికీ ముసాయిదా రూపంలోనే ఉన్న నిబంధనలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా నిరసన తప్పదని తీర్మానంలో తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని కూడా తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.

➡️